వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Updated : 04 May 2024 06:59 IST

17 నుంచి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నారాయణగిరి ఉద్యాన వనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద బాలాంజనేయ స్వామివారి ఆలయంలో జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు హనుజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

 ఏప్రిల్‌ హుండీ కానుకలు రూ.101.63 కోట్లు: తిరుమల శ్రీవారిని ఏప్రిల్‌ నెలలో 20.17 లక్షల మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు  రూ.101.63 కోట్లు లభించాయి. భక్తులు 94.22 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారు. అన్నప్రసాదం 39.73 లక్షల మంది స్వీకరించారు. స్వామివారికి    8.08 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు