నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.

Published : 03 May 2024 03:52 IST

న్యాయాధికారులకు జస్టిస్‌ దుర్గాప్రసాదరావు సూచన

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు అన్నారు. గురువారం మంగళగిరి వద్ద ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీలో నూతన నేర న్యాయ చట్టాలపై న్యాయాధికారులకు అవగాహనా తరగతులను నిర్వహించారు. కార్యక్రమానికి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై కొత్త చట్టాల్లోని అంశాలను వివరించారు. ఎంపిక చేసిన న్యాయాధికారులకు 2, 3 తేదీలలో ప్రత్యక్షంగా, రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ 4వ తేదీన ప్రత్యక్షంగా, దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా అవగాహనా సదస్సు ఏర్పాటు చేసినట్లు జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎ.హరిహరనాథశర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని