వడగాలులు తగ్గుముఖం.. వర్షాలకు అవకాశం!

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు వడగాలులు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 06 May 2024 05:06 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు వడగాలులు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.

ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా మహానందిలో 45.8, కర్నూలు జిల్లా జి.సింగవరంలో 45.6, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 45.5, ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 45.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, వైఎస్సార్‌ జిల్లా ఉప్పలూరు, సింహాద్రిపురంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 5 మండలాల్లో తీవ్ర వడగాలులు, 117 మండలాల్లో వడగాలులు వీచాయి. సోమవారం  విజయనగరం జిల్లాలో 13,  శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని