Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి

Automobile retail sales | నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల పండగ సీజన్‌ (festive season)లో మొత్తం వాహన విక్రయాల సంఖ్య 31,95,213 యూనిట్ల నుంచి 37,93,584 యూనిట్లకు చేరింది.

Published : 28 Nov 2023 14:42 IST

Automobile retail sales | దిల్లీ: ఈ పండగ సీజన్లో వాహన రిటైల్‌ విక్రయాలు (Automobile retail sales) రికార్డు స్థాయిలో నమోదయ్యాయని ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ‘ఫాడా’ వెల్లడించింది. ఒక్క ట్రాక్టర్లు మినహాయించి అన్ని విభాగాల అమ్మకాల్లో గణనీయ వృద్ధి నమోదైనట్లు తెలిపింది. నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగే 42 రోజుల పండగ సీజన్‌ (festive season)లో మొత్తం వాహన విక్రయాలు 19 శాతం పెరిగాయి. క్రితం ఏడాది 31,95,213 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈసారి ఆ సంఖ్య 37,93,584 యూనిట్లకు చేరింది.

  • ప్రయాణికుల వాహన విక్రయాలు (Passenger vehicle Sales) 4,96,047 యూనిట్ల నుంచి 10 శాతం పెరిగి 5,47,246 యూనిట్లకు చేరాయి. సీజన్‌ మొదట్లో ఈ విభాగంలో విక్రయాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ.. దీపావళి నుంచి పుంజుకున్నాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. ఈ విభాగంలో ఎస్‌యూవీలకు అత్యధిక గిరాకీ లభించినట్లు పేర్కొన్నారు. 
  • కొత్త ద్విచక్ర వాహన విక్రయాల్లోనూ 21 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఏడాది 23,96,665 యూనిట్లు అమ్ముడుకాగా.. ఈసారి 28,93,107 యూనిట్లకు చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడంతో ఈ విభాగంలో రికార్డు స్థాయి విక్రయాలు నమోదైనట్లు ఫాడా తెలిపింది.
  • వాణిజ్య వాహన విక్రయాలు ఎనిమిది శాతం పెరిగి 1,23,784 యూనిట్లకు చేరాయి.
  • త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లు 1,01,052 యూనిట్ల నుంచి 41 శాతం పెరిగి 1,42,875 యూనిట్లకు చేరాయి.
  • ట్రాక్టర్ల విక్రయాలు 86,951 యూనిట్ల నుంచి 86,572 యూనిట్లకు తగ్గాయి. ఈ ఒక్క విభాగపు అమ్మకాల్లోనే స్వల్ప క్షీణత నమోదైంది. నవరాత్రి సమయంలో 8.3 శాతం తక్కువ విక్రయాలు జరిగినప్పటికీ.. క్రమంగా పుంజుకున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని