BMW-Tata Tech: బీఎండబ్ల్యూ.. టాటా టెక్‌ జాయింట్ వెంచర్‌

BMW-Tata Tech: జాయింట్‌ వెంచర్‌ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్‌నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వెహికల్‌ (SDV) సొల్యూషన్స్‌తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు.

Updated : 02 Apr 2024 13:50 IST

దిల్లీ: వాహనాలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌, ఐటీ కోసం భారత్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జర్మనీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW), దేశీయ డిజిటల్‌ సేవల కంపెనీ టాటా టెక్‌ (Tata Technologies) కలిసి జాయింట్‌ వెంచర్‌ను నెలకొల్పనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. బెంగళూరు, పుణెలో డెవలప్‌మెంట్, ఆపరేషన్స్‌ కేంద్రం, చెన్నైలో ఐటీ సొల్యూషన్స్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పాయి. జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు సంబంధిత నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.

ఈ జాయింట్‌ వెంచర్‌ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్‌నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వెహికల్‌ (SDV) సొల్యూషన్స్‌తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. తొలుత 100 మంది ఉద్యోగులతో దీన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. క్రమంగా సిబ్బంది సంఖ్యను వేలల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. బీఎండబ్ల్యూ సాఫ్ట్‌వేర్‌, ఐటీ హబ్స్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్స్‌లో ఈ జాయింట్‌ వెంచర్‌ చేరుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని