మీ ఆర్థిక నిర్వ‌హ‌ణ స‌రిగ్గానే ఉందా చెక్ చేసుకోండి!

ఇక్క‌డ‌ అడిగిన 12 ప్ర‌శ్న‌ల‌కు మీ స‌మాధానం అవును అయితే ఆర్థిక విష‌యాల్లో మీరు స‌రైన మార్గంలోనే న‌డుస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు 

Published : 30 Jun 2021 15:26 IST

డ‌బ్బు నిర్వ‌హణ‌లో పాటించాల్సిన ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోండి. ఇవ‌న్నీ పాటిస్తే మీకు భ‌విష్య‌త్తులో ఎటువంటి ఆర్థిక స‌మ‌స్య‌లతో భాధ‌ప‌డే అవ‌కాశం ఉండ‌దు. ఒక‌వేళ ఇప్ప‌టికీ ఈ కింద పేర్కొన్న అంశాల‌ను మీరు ప్రారంభించ‌క‌పోతే ఇప్ప‌టికీ ఆల‌స్యం కాలేదు ఇప్పుడే ప్రారంబించ‌డం మేలు. 
 మీరు స్థిర‌మైన ఆదాయం పొందుతున్నారా?
మీరు నెల‌వారిగా స్థిర‌మైన ఆదాయం పొందుతున్నారా అయితే మీరు ఇప్ప‌టివ‌ర‌కు ఎంత సంపాదించారో మీకు తెలుసా మీ సంపాద‌న ప‌రిధిలోనే ఖ‌ర్చు చేస్తే మంచిమార్గంలోనే న‌డుస్తున్న‌ట్లు  అని విశ్లేష‌కులు చెప్తున్నారు. 
ఖ‌ర్చు చేసే విధానం అర్థం చేసుకుంటున్నారా?
మీరు ఎంత సంపాదిస్తున్నారో , ఎంత ఖర్చు చేస్తున్నారో మీకు తెలియాలి.  ప్రస్తుత వ్యయ అలవాట్ల ద్వారా  మీ ఆర్థిక శ్రేయస్సుకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే మీరు డబ్బు నిర్వహణ విష‌యంలో జాగ్ర‌త్త‌గానే ఉన్న‌ట్లు భావించ‌వ‌చ్చు.
 రుణం తీసుకోకుండా బిల్లు చెల్లిస్తున్నారా?
 నిత్యావ‌స‌ర ఖ‌ర్చులు, చెల్లించే బిల్లులు మీ సొంత డ‌బ్బుతో ఎటువంటి అప్పు చేయ‌కుండా చెల్లిస్తుంటే ఇది మంచి విష‌య‌మే
 షాపింగ్ ఎలా చేస్తున్నారు?
 షాపింగ్ చేయ‌డం త‌ప్పు కాదు కానీ దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నామ‌న్న‌ది లెక్కించుకోవాలి. మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌కు భంగం క‌ల‌గ‌కుండా షాపింగ్ చేయ‌గ‌లిగితే ఫ‌ర్వాలేదు
  ప్ర‌తి నెల పొదుపు చేస్తున్నారా?
 ఖ‌ర్చు చేయ‌డం ఫ‌ర్వాలేదు కానీ దానికి త‌గిన‌ట్లుగా ప్ర‌తి నెల‌కు డ‌బ్బును పొదుపు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి. ప్ర‌తి నెల కొంత డ‌బ్బును పొదుపు చేస్తే ఎలాంటి స‌మ‌స్య లేదు. పొదుపు చేసిన దానినుంచి ఖ‌ర్చు చేయ‌కుండా అత్య‌వ‌స‌రాల కోసం ప‌క్క‌న‌పెట్టుకోవాలి.
 ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను ప్రారంభించారా?
మొద‌టి నెల జీతం అందుకున్న‌ప్ప‌టినుంచే ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక మొద‌లుపెట్టాలి. మీ రిటైర్మెంట్ కోసం ప్ర‌తినెల కొంత డ‌బ్బు కేటాయిస్తున్న‌ట్ల‌యితే మీరు డ‌బ్బు నిర్వ‌హ‌ణ విష‌యంలో మంచి మార్గంలోనే న‌డుస్తున్న‌ట్లు గుర్తించాలి.
ఆర్థిక ల‌క్ష్యాల‌కు చేరుకున్నారా?
మీ ల‌క్ష్యం కోసం ఏర్పాటు చేసుకోవాల‌నుకున్న మొత్తం స‌మ‌కూరిందా? ప్ర‌తి నెల కొంత మీ ఆర్థిక ల‌క్ష్యాల కోసం ఖ‌ర్చు పెడుతున్న‌ట్ల‌యితే మీరు క్ర‌మ‌మైన పెట్టుబ‌డిదారుడిగా ప‌రిగణించ‌బ‌డ‌తారు.
క్రెడిట్ రిపోర్ట్‌ క్ర‌మంగా చూసుకుంటున్నారా?
చాలా మంది దీని గురించి ప‌ట్టించుకోరు. కానీ ఇది చాలా అవ‌స‌రం . మీ క్రెడిట్ స్కోర్ చూసే బ్యాంకులు మీకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు రుణాల‌ను అంద‌జేస్తాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి
జీరో క్రెడిట్ కార్ట్ రుణం ఉందా?
ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉప‌యోగించ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ఇవి ఉప‌యోగించ‌డం మంచిదా కాదా అన్న విష‌యం ప‌క్న పెడితే, చాలా మంది వాటిపై వ‌చ్చే ఆఫ‌ర్ల‌ను కూడా చాలా బాగా ఉప‌యోగించుకుంటారు. క్రెడిట్ కార్డుపై రుణాలు లేక‌పోతే ఎలాంటి స‌మ‌స్య లేదు.
ఆర్థిక విష‌యాల‌ గురించి చ‌ర్చిస్తున్నారా?
మీ కుటుంబ‌స‌భ్యుల‌తో ఆర్థిక విషయాల‌పై చ‌ర్చించ‌డం చాలా ముఖ్యం. భ‌విష్య‌త్తులో ఉండే అవ‌స‌రాలు,  ఖ‌ర్చుల గురించి మాట్లాడుతుంటే ఖ‌ర్చులు త‌గ్గించుకొని, ల‌క్ష్యం వైపు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది.
డ‌బ్బు గురించి కొత్త విష‌యాలు తెలుసుకుంటున్నారా?
 వ‌య‌సుతో ప‌నిలేకుండా, మీ ప‌రిస్థితుల‌తో ప‌నిలేకుండా డ‌బ్బు గురించి, ఆర్థిక విష‌యాల గురించి తెలుసుకోవాలి. తెలివైన వ్య‌క్తులు ఎప్పుడూ పెట్టుబ‌డులు, డ‌బ్బు నిర్వ‌హ‌ణ గురించి నిరంత‌రం కొత్త విష‌యాలు తెలుసుకునేందుకు కృషిచేస్తారు.. అప్పుడు మీరు అనుకున్న ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవ‌చ్చు.
పెట్టుబ‌డులు పెడుతున్నారా?
 మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం చాలా ముఖ్యం. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవాలి. 
  పైన చెప్పిన‌వ‌న్నీ మీరు పాటిస్తున్నారంటే ఆర్థిక నిర్వ‌హ‌ణ‌లో మెరుగ్గానే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని