Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు

Mahindra XUV 3XO: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 29 Apr 2024 20:09 IST

Mahindra XUV 3XO | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra) తన ఎక్స్‌యూవీ 300 ఫేస్‌ లిఫ్ట్‌ కారు ఎక్స్‌యూవీ 3XOను (XUV 3XO) దేశీయ మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ 300తో పోలిస్తే ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందూ వెనుక ‘సి’ షేప్‌తో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ అమర్చారు. 10.25 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను ఇచ్చారు.

ఈ సెగ్మెంట్‌లో తొలిసారి పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను మహీంద్రా తీసుకొచ్చింది. దీంతో పాటు సెవెన్‌ స్పీకర్‌ హర్మన్‌ కర్డాన్‌ సౌండ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. వైర్‌లెస్‌ ఛార్జర్‌, ఏంబియన్‌ లైటింగ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌, 360 కెమెరా, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ రియర్‌ ఏసీ వెంట్స్‌ ఉన్నాయి. అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌ వంటి ఫీచర్లతో కూడిన లెవల్‌ 2 అడాస్‌తో వస్తోంది. 6 ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. ఇంజిన్‌ విషయానికొస్తే.. ఎక్స్‌యూవీ 3XO మూడు రకాల ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌, 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌, టర్బో స్పోర్ట్‌ వేరియంట్‌లలో లభిస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఏఎంటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో వస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని