Motor Insurance: వాహన బీమా సంస్థల క్లెయిమ్స్‌ రేషియో ఎంతెంత?

దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి.

Published : 01 Apr 2024 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాహన బీమా కూడా ఇతర బీమా పాలసీల వంటిదే. పేరులో ఉన్నట్లుగానే అన్ని రకాల మోటర్‌ వాహనాలకు ఈ బీమా వర్తిస్తుంది. వాహనదారుల భద్రత, ఇతరుల రక్షణ కోసం ప్రభుత్వం వాహన బీమాను తప్పనిసరి చేసింది. అనేక రకాల వాహన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వాహనదారుడూ తమ వాహనానికి తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. ఇది వాహన భద్రతతో పాటు వ్యక్తి భద్రతకు కూడా అవసరం. బీమా చేసేటప్పుడు ఏ బీమా సంస్థ వేగంగా, ఎక్కువ శాతం క్లెయింలను సెటిల్‌ చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) మోటారు బీమా కంపెనీల క్లెయిమ్‌ చెల్లింపు వివరాలను తెలిపింది. మోటారు బీమా సంస్థల క్లెయిం రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడొచ్చు.

గమనిక: పైన తెలిపిన వివరాలు ౨౦౨౨-౨౩ ఆర్ధిక సంవత్సరానికి చెందినవి. ౨౦౨౩-2౪కు సంబంధించిన వివరాలు IRDA ఇంకా విడుదల చేయలేదు. కొన్ని బీమా సంస్థలు వారు పొందిన ప్రీమియం మొత్తం కంటే ఎక్కువ క్లెయిం మొత్తం సెటిల్‌ చేసినప్పుడు, క్లెయిం శాతం 100 శాతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని