Tax Collections: పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. ₹69 వేల కోట్లు రిఫండ్‌

Direct tax collections: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16 శాతం మేర పెరిగాయి. ఇప్పటి వరకు రూ.69 వేల కోట్లు రిఫండ్ల కింద జారీ చేసినట్లు సీబీడీటీ తెలిపింది.

Published : 11 Aug 2023 17:40 IST

దిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో (Direct tax collections ) 16 శాతం మేర వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు 10 నాటికి స్థూలంగా రూ.6.53 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు  నమోదైనట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. రిఫండ్ల మినహాయిస్తే నికరంగా ఈ మొత్తం రూ.5.84 లక్షల కోట్లని పేర్కొంది. స్థూల వసూళ్లు గతేడాదితో పోలిస్తే 15.73 శాతం మేర పెరగ్గా.. నికర వసూళ్లు 17.33 శాతం మేర పెరిగినట్లు ప్రత్యక్ష పన్ను వసూళ్ల బోర్డు (CBDT) పేర్కొంది.

ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్రం చర్యలు.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధి నమోదవుతోందని సీబీడీటీ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇప్పటి వరకు 32.03 శాతం మేర వసూళ్లు జరిగాయని తెలిపింది. ఆగస్టు 10 వరకు రూ.69 వేల కోట్ల మొత్తాన్ని రిఫండ్ల కింద జారీ చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రిఫండ్లు సైతం 3.73 శాతం అధికమని తెలిపింది. సాధారణంగా వ్యక్తులు, కంపెనీలు చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పేర్కొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని