Onions Price : ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్రం చర్యలు.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల (onions) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (government) బఫర్‌ స్టాక్‌ను (buffer stock) విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి.

Published : 11 Aug 2023 17:12 IST

దిల్లీ: దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల (onions) ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం (Central government) చర్యలు చేపట్టింది. ఇదివరకే సేకరించిన బఫర్‌ స్టాక్‌ను (buffer stock) మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం బఫర్‌ స్టాక్‌గా గోదాముల్లో భద్రపరిచింది. ఏటా మార్కెట్లోకి సరఫరా తగ్గి, ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్‌ స్టాక్‌ను విడుదల చేస్తుంటుంది. దాంతో నిత్యావసరాల్లో ఒకటైన ఉల్లిపాయ ధరలు అమాంతం పెరగకుండా నియంత్రిస్తుంది. ‘దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదైన, దేశంలోని సగటు ఉల్లి రేటు కంటే ఎక్కువగా ఉన్న, గత నెలతో పోలిస్తే ధరలు పెరిగిన ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తాం. ఈ-వేలం, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్‌ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని’ ఆహార మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఓలాకు పోటీగా ఏథర్‌ ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

వినియోగదారులకు సరసమైన ధరల్లో ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో క్రమానుగతంగా వాటిని పంపించాల్సిన ప్రాంతం, పరిమాణాన్ని నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం కోరితే తగ్గింపు ధరతో వాటిని సరఫరా చేస్తామని అందులో వెల్లడించింది. గతంలో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం బఫర్‌ ఏటా స్టాక్‌ సేకరణ పెంచుకుంటూ పోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ మాత్రమే ఉండేది. ఆ పరిమాణం ఇప్పుడు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఏప్రిల్-జూన్‌ మధ్య కాలంలో పండించిన రబీ ఉల్లి ఉత్పత్తి మార్కెట్లో 65 శాతం వాటాను కలిగి ఉంది. దాంతో మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌లో పండించే ఉల్లి అందుబాటులోకి వచ్చే వరకు వినియోగదారుల అవసరాలు తీరుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని