భారత్‌లోకి కొత్త కవాసకి నింజా 500

ఇండియా కవాసకి మోటార్స్‌, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు.

Updated : 23 Feb 2024 06:37 IST

దిల్లీ: ఇండియా కవాసకి మోటార్స్‌, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. ఈ బైక్‌ పరిచయ ధర రూ.5.24 లక్షలు(ఎక్స్‌ షోరూం). 451 సీసీ పారెలల్‌-ట్విన్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌కు స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌, కవాసకి ఇంటెలిజెంట్‌ ప్రాక్సిమిటీ యాక్టివేషన్‌ స్టార్ట్‌ సిస్టమ్‌(కిపాస్‌) వంటి ఫీచర్లున్నాయి. ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457, యమహా వైజడ్‌ఎఫ్‌-ఆర్‌3, కేటీఎమ్‌ ఆర్‌సీ 390లకు ఇది పోటీగా వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు