మహీంద్రా స్కార్పియో-ఎన్‌ జెడ్‌8 సెలెక్ట్‌

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్‌ జెడ్‌8 సెలెక్ట్‌’ వేరియంట్‌ను గురువారం విడుదల చేసింది.

Updated : 23 Feb 2024 06:38 IST

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) సంస్థ, ‘స్కార్పియో-ఎన్‌ జెడ్‌8 సెలెక్ట్‌’ వేరియంట్‌ను గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.17 లక్షలు. స్కార్పియో-ఎన్‌ జెడ్‌8 ప్రీమియం శ్రేణికి ఇది అదనపు వేరియంట్‌ అని కంపెనీ తెలిపింది. మార్చి 1 నుంచి విక్రయ కేంద్రాల్లో ఈ వేరియంట్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పెట్రోల్‌- డీజిల్‌ ఇంజిన్లతో, ఆటోమేటిక్‌- మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో ఇది లభించనుంది. అడ్రెనాక్స్‌ కనెక్ట్‌, బిల్ట్‌-ఇన్‌ అలెక్సా వంటి ప్రీమియం ఫీచర్లు ఈ వేరియంట్‌లో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని