టాటా ఎస్‌యూవీల్లో డార్క్‌ సిరీస్‌లు

టాటా మోటార్స్‌ తన నెక్సాన్‌ ఎస్‌యూవీ బ్రాండ్‌లో డార్క్‌ సిరీస్‌లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్‌, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి.

Updated : 06 Mar 2024 07:22 IST

ధరల శ్రేణి రూ.11.45-20.69 లక్షలు

దిల్లీ: టాటా మోటార్స్‌ తన నెక్సాన్‌ ఎస్‌యూవీ బ్రాండ్‌లో డార్క్‌ సిరీస్‌లను విడుదల చేసింది. సంప్రదాయ ఐసీఈ ఇంజిన్‌, విద్యుత్తు మోడళ్లలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఎస్‌యూవీలైన న్యూ సఫారీ, న్యూ హ్యారియర్‌లోనూ డార్క్‌ వెర్షన్లను తీసుకొచ్చింది. న్యూ నెక్సాన్‌లో డార్క్‌ శ్రేణి ప్రారంభ ధర రూ.11.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ)గా ఉంది. న్యూ నెక్సాన్‌ ఈవీ డార్క్‌ ఎడిషన్‌ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, భారత్‌)గా ఉంది. న్యూ హ్యారియర్‌ డార్క్‌ ఎడిషన్‌ ధర రూ.19.99 లక్షలు, న్యూ సఫారీ డార్క్‌ ధర రూ.20.69 లక్షలుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని