బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ కొత్త మోడళ్లు

బజాజ్‌ ఆటో పల్సర్‌ ఎన్‌ఎస్‌ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది.

Updated : 06 Mar 2024 07:21 IST

పుణె: బజాజ్‌ ఆటో పల్సర్‌ ఎన్‌ఎస్‌ శ్రేణిలో 2024 సంవత్సర మోడళ్లను విపణిలోకి విడుదల చేసింది. పల్సర్‌ ఎన్‌ఎస్‌200 ధర రూ.1,57,427, పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160 ధర రూ.1,45,792, పల్సర్‌ ఎన్‌ఎస్‌125 ధర రూ.1,04,922 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. ఈ బైకులు బ్రూక్లిన్‌ బ్లాక్‌, పెర్ల్‌ మెటాలిక్‌ వైట్‌, రేసింగ్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తాయి. బ్లూటూత్‌ అనుసంధానిత రివర్స్‌ మోనోక్రోమేటిక్‌ ఎల్‌సీడీ కన్సోల్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థ,  టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ వంటి ఫీచర్లు ఈ బైకుల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని