టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత్‌లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు.

Updated : 04 Apr 2024 06:34 IST

ధర రూ.7.73 లక్షల నుంచి..

ముంబయి: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత్‌లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. హైబ్రిడ్‌, బ్యాటరీ విద్యుత్‌ వాహనాలపైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీ అయిన అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌ను బుధవారమిక్కడ కంపెనీ ఆవిష్కరించింది. కొత్త మోడళ్లను తీసుకురావడం కోసం కొత్త తయారీ ప్లాంటు బిడాది ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా అసజుమా పేర్కొన్నారు. 2026 నుంచి కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, టైజర్‌ ధర రూ.7.73-13.03 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ ఆధారిత క్రాసోవర్‌ అయిన ఈ మోడల్‌ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే 2024 నుంచి డెలివరీలు మొదలవుతాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో సీఎన్‌జీ కిట్‌ ఆప్షన్‌ కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని