Watch: స్కూటర్‌ను అతికిస్తే ఆటో రిక్షా.. స్టార్టప్‌ వినూత్న ఆవిష్కరణ!

surge: హీరోకు చెందిన సర్జ్‌ స్టార్టప్‌ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. అవసరాలకు అనుగుణంగా టూ వీలర్‌, త్రీ వీలర్‌ విద్యుత్‌ వాహనాన్ని తీసుకొచ్చింది.

Updated : 27 Jan 2024 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలన్‌ను హీరో వెంటాడుతుంటాడు.. విలన్‌ మరింత వేగంగా దూసుకెళ్తుంటాడు.. అప్పటివరకు టూవీలర్‌ మీద వెళ్తున్న హీరో ఒక్క బటన్‌ ప్రెస్‌ చేయగానే ఆ వాహనం.. పవర్‌ఫుల్‌ రేసింగ్‌ కారుగా మారిపోతుంది. ఇలాంటివి సాధారణంగా హాలీవుడ్‌ అడ్వెంచర్‌ చిత్రాల్లో కనిపిస్తుంటాయి. ఇదే ఆలోచన ఇప్పుడు నిజ జీవితంలోనూ పురుడు పోసుకుంది. విద్యుత్‌ స్కూటర్‌ను క్షణాల్లోనే ఆటో రిక్షాగా మార్చుకునేలా ఓ కొత్త వాహనాన్ని హీరో మోటోకార్ప్‌కు చెందిన సర్జ్‌ స్టార్టప్ రూపొందించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్‌’ ఈవెంట్‌లో దీన్ని ప్రదర్శించారు.

సర్జ్‌ 32 పేరిట ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. స్వయంఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇదో టూ-ఇన్‌- వన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌. అవసరాలకు తగ్గట్టుగా కావాల్సినవిధంగా మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం త్రీవీలర్‌గానూ, వ్యక్తిగత అవసరాల కోసం 2 వీలర్‌గానూ కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. సాధారణ ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీ వీలర్‌ ఆటో రిక్షాలోనూ విండ్‌ స్క్రీన్‌, హెడ్‌ల్యాంప్‌, టర్న్‌ ఇండికేటర్లు, విండ్‌ స్క్రీన్‌ వైపర్లు ఉన్నాయి. ఆటోకు డోర్లు లేనప్పటికీ.. జిప్‌తో కూడిన సాఫ్ట్‌డోర్‌లను అందించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో ఓలా ఇ-బైక్ ట్యాక్సీ సేవలు

ఇక కొత్త తరహా వాహనంలో త్రీవీలర్‌, టూవీలర్‌కు వేర్వేరు సామర్థ్యాలు నిర్ణయించారు. త్రీవీలర్‌లో 10kW ఇంజిన్‌ ఇచ్చారు. 11kWh బ్యాటరీని ఇచ్చారు. ఇక స్కూటర్‌లో 3kW ఇంజిన్‌ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా 3.5 kWh బ్యాటరీని అమర్చారు. త్రీవీలర్‌ టాప్‌ స్పీడ్‌ 50 కిలోమీటర్లు. 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. టూవీలర్‌ గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ రేంజ్‌ వివరాలు తెలియరాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని