Ola e-bike taxi: హైదరాబాద్‌లో ఓలా ఇ-బైక్ ట్యాక్సీ సేవలు

Ola e-bike taxi: ఓలా సంస్థ ఇ-బైక్‌ ట్యాక్సీ సేవలను దిల్లీ, హైదరాబాద్‌ల్లో ప్రారంభించింది. బెంగళూరులో ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 26 Jan 2024 21:19 IST

Ola e-bike taxi | బెంగళూరు: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా (Ola) హైదరాబాద్‌, దిల్లీలో ఇ-బైక్‌ ట్యాక్సీ (e-bike taxi) సేవలను ప్రారంభించింది. బెంగళూరులో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 100 కోట్ల మంది భారతీయులకు సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే రెండు నెలల్లో ఆయా నగరాల్లో 10వేల ఇ-వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏడాది చివరికి ఇ-బైక్‌ సేవలను మరింత విస్తరించనుంది. 5 కిలోమీటర్లకు రూ.25, 10 కిలోమీటర్లకు రూ.50, రూ.15 కిలోమీటర్లకు రూ.75 చొప్పున తక్కువ ధరకే బైక్‌ ట్యాక్సీ సేవలను అందించనుంది.

భారత ఈ-కామర్స్‌లో 48% మార్కెట్‌ వాటాతో ఫ్లిప్‌కార్ట్‌ ముందంజ!

బెంగళూరులో విజయవంతం అయిన ఇ-బైక్‌ ట్యాక్సీ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలన్నదే తమ లక్ష్యమని ఓలా మొబిలిటీ సీఈఓ హేమంత్ భక్షి తెలిపారు. దీనివల్ల తక్కువ ధరకే బైక్‌ ట్యాక్సీ సేవలు లభించడంతో పాటు గిగ్‌ ఎకానమీ వర్కర్ల కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుందన్నారు. 2023 సెప్టెంబర్‌లో ఓలా తొలిసారిగా ఇ-బైక్‌ ట్యాక్సీ సేవలను బెంగళూరులో పరీక్షించింది. ఇప్పటివరకు 1.75 మిలియన్‌ రైడ్లు పూర్తయ్యాయి. ఇ-బైక్‌ ట్యాక్సీల కోసం బెంగళూరులో 200 ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటుచేసింది. ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని