Honda Recall: హోండా మోటార్‌ సైకిళ్ల రీకాల్‌.. కారణం ఇదే!

హోండా కంపెనీ తన సీబీ350, సీబీ 350 ఆర్‌ఎస్‌ మోడల్‌ బైకులను రీకాల్‌ చేసింది. ఒక పార్ట్‌లో లోపాన్ని గుర్తించామని, దాన్ని రీప్లేస్‌ చేసి ఇస్తామని కంపెనీ పేర్కొంది.

Updated : 02 Dec 2023 14:06 IST

Honda Recall | దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొన్ని ద్విచక్ర వాహనాలను రీకాల్‌ చేసింది. 350 సీసీ సెగ్మెంట్‌లో ఆ కంపెనీ తీసుకొచ్చిన Hness సీబీ350, సీబీ350ఆర్‌ఎస్‌ మోడల్‌ మోటార్‌ సైకిళ్లను రీకాల్‌ చేసింది. ఒక పార్టులోని లోపాన్ని తనిఖీ చేసి సరిచేసి ఇచ్చేందుకు ఈ రీకాల్‌ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. ఎన్ని బైకులు రీకాల్‌ చేసిందీ మాత్రం హోండా వెల్లడించలేదు.

వెనుక వైపు స్టాప్‌ లైట్‌ స్విచ్‌కు సంబంధించిన రబ్బర్‌ పార్ట్‌ తయారీలో లోపం ఉందని హోండా గుర్తించింది. దీనివల్ల రబ్బర్‌లో క్రాక్‌ వచ్చే అవకాశం ఉందని, దానివల్ల స్విచ్‌ లోపలికి నీరు చేరే అవకాశం ఉందని పేర్కొంది. 2020 అక్టోబర్‌ నుంచి 2023 జనవరి మధ్య తయారైన వాహనాల్లో ఈ లోపం ఉన్నట్లు హోండా ఓ ప్రకటనలో తెలిపింది. ముందుస్తు చర్యల్లో భాగంగా వాహనాలను రీకాల్‌ చేస్తున్నట్లు హోండా తెలిపింది. 

హోండా నుంచి మరో కొత్త 350cc బైక్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

హోండాకు చెందిన బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌ కేంద్రాల్లో డిసెంబర్‌ రెండో వారం నుంచి పార్ట్‌ను మారుస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం వాహనదారులు ఎలాంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారెంటీ ఉన్నా లేకపోయినా ఫ్రీగానే పార్ట్‌ను రీప్లేస్‌ చేస్తామని కంపెనీ పేర్కొంది. మరోవైపు 350సీసీ సెగ్మెంట్‌లో ఇటీవల సీబీ350ని (Honda CB350) హోండా విడుదల చేసింది. డిజైన్‌ విషయంలో పోటీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లోని క్లాసిక్‌ 350, బుల్లెట్‌ 350 మోడళ్లను ఇది పోలి ఉంది. సీబీ350 డీఎల్‌ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.1.99 లక్షలు. డీఎల్‌ఎక్స్‌ ప్రో వేరియంట్‌ ధర రూ.2.17 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు