Investment: వాహన రంగంలో మదుపు

వాహన సంస్థలు, వాహన విడిభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎస్‌బీఐ ఆటోమోటివ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది.

Published : 24 May 2024 00:43 IST

వాహన సంస్థలు, వాహన విడిభాగాల ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఎస్‌బీఐ ఆటోమోటివ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి పథకం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకత. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 31 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఇది సెక్టోరియల్‌/థీమ్యాటిక్‌ విభాగానికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీని కింద సేకరించిన నిధులను దాదాపు 134 కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆటో కాంపోనెంట్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగానికి చెందిన కంపెనీలు 85 వరకూ ఉంటాయి. కాస్టింగ్స్‌ అండ్‌ ఫోర్జింగ్స్‌ కంపెనీలు మరో 11 కనిపిస్తున్నాయి. కేవలం విడిభాగాల కంపెనీలే కాకుండా ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ కంపెనీలనూ పెట్టుబడి కోసం పరిశీలిస్తారు.

ఈ పథకానికి తన్మయ దేశాయ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. నిఫ్టీ ఆటో టీఆర్‌ఐ సూచీని దీనికి కొలమానంగా తీసుకుంటారు. మనదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఆటోమోటివ్‌ రంగం ఒకటి. అంతేగాక ఎన్నో ఆసక్తికరమైన మార్పులు ఇందులో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు వాహనాల వాడకం పెరుగుతోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులూ లభిస్తున్నాయి. అదే సమయంలో ఏటేటా వాహనాల అమ్మకాలు అధికంగా నమోదు కావటం గమనార్హం. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆటోమోటివ్‌ రంగం పెట్టుబడికి అనువైనదిగా కనిపిస్తుంది. వచ్చే కొన్నేళ్ల పాటు అధిక వృద్ధి నమోదై, మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఈ రంగంలో కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు