Jeep Compass: జీప్‌ కంపాస్‌లో నైట్‌ ఈగిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు

Jeep Compass: జీప్‌ కంపాస్‌లో నైట్‌ ఈగిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్‌ ఫినిష్‌తో తీర్చిదిద్దింది.

Published : 10 Apr 2024 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీప్‌ ఇండియా ఈరోజు కంపాస్‌ మోడల్‌లో నైట్‌ ఈగిల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను (Jeep Compass Night Eagle limited edition) విడుదల చేసింది. దీని ధర రూ.20.5 లక్షలు (ఎక్స్‌షోరూం). ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో లేదా దగ్గర్లో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించి బుక్‌ చేసుకోవచ్చు.

ఈ నైట్‌ ఈగిల్‌ ఎడిషన్‌లో (Jeep Compass Night Eagle limited edition) బ్లాక్‌ డ్యుయల్‌-టోన్‌ రూఫ్‌ ప్రామాణికంగా వస్తోంది. ఎక్స్‌టీరియర్‌ కోసం నలుపు, తెలుపు, ఎరుపు రంగులను కంపెనీ ఆప్షన్‌గా ఇస్తోంది. గ్రిల్‌, గ్రిల్‌ రింగులు, డేలైట్‌ ఓపెనింగ్‌లు, రూఫ్‌ రెయిల్స్‌కు గ్లాస్‌ బ్లాక్‌ ఫినిష్‌ ఇచ్చారు. డ్యాష్‌క్యామ్‌, వెనకభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ యూనిట్‌, ప్రీమియం కార్పెట్‌ మ్యాట్స్‌, అండర్‌బాడీ లైటింగ్‌, యాంబియెంట్‌ లైట్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్‌ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. యాపిల్‌ కార్‌ప్లే/ఆండ్రాయిడ్‌ ఆటోతో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, అనలాగ్‌ డయల్స్‌తో కూడిన ఏడు అంగుళాల డిజిటల్‌ క్లస్టర్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, క్రూజ్‌ కంట్రోల్‌, స్టార్ట్‌/స్టాప్‌ పుష్‌బటన్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు కూడా వస్తున్నాయి.

కంపాస్‌ నైట్‌ ఈగిల్‌ ఎడిషన్‌ (Jeep Compass Night Eagle limited edition) సింగిల్‌ ఇంజిన్‌, టూ గేర్‌ బాక్స్ ఆప్షన్లతో వస్తోంది. 2.0 లీటర్‌, 4-సిలిండర్‌, టర్బోఛార్జ్‌ డీజిల్‌ ఇంజిన్‌ను పొందుపర్చారు. ఇది 350 ఎన్‌ఎం టార్క్‌, 168 హెచ్‌పీ పవర్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్‌ మాన్యువల్‌, 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లను ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని