kawasaki: కవాసకి నుంచి కొత్త బైక్‌.. ధర రూ.9.29 లక్షలు

kawasaki z900: ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి జెడ్‌ 900 పేరుతో కొత్త బైక్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 22 Feb 2024 23:47 IST

kawasaki z900 | ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) భారత మార్కెట్‌లో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ.. బైక్ ప్రియుల కోసం జెడ్ 900 (kawasaki z900) మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.9.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. మెటాలిక్ స్పార్క్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

బైక్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. 948cc లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ అమర్చారు. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 9,500 rpm వద్ద 123.6 bhp పవర్‌ను, 7,700rpm వద్ద 98.6Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ఇచ్చారు. స్పోర్ట్, రోడ్, రైన్, రైడర్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్‌లను ఎంచుకొనే సదుపాయం ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్‌ సదుపాయం ఉందని కంపెనీ పేర్కొంది. టీఎఫ్‌టీ స్క్రీన్‌ ఉంటుంది. దీన్ని రైడాలజీ అప్లికేషన్‌కు కనెక్ట్‌ చేయొచ్చు. బైక్‌ దృఢత్వం కోసం హై టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. ముందువైపు 41mm అప్‌-సైడ్‌ డౌన్‌ ఫోర్క్‌, వెనుకవైపు మోనోషాక్‌ను అమర్చారు. ముందు భాగంలో 300mm డిస్క్‌ బ్రేక్‌, వెనక వైపు 250mm డిస్క్‌ బ్రేక్‌లు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని