Kia cars: కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్‌ సహా 6 నగరాల్లో

కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్‌ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి.

Updated : 18 May 2024 01:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్‌ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. ఇలాంటివి ఏమీ లేకుండా, కొత్త కారును లీజుపై తీసుకుని, వాడుకునే సేవను కియా ఇండియా అందుబాటులోకి తెస్తోంది. ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుని, ‘కియా లీజ్‌’ సేవను హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణేలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కియా ఇండియా చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ మ్యుంగ్‌-సిక్‌ సోన్‌ తెలిపారు. కియా లీజ్‌లో భాగంగా వాహనాన్ని 24-60 నెలల వ్యవధికి లీజుకు తీసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు చెల్లింపు చేయనక్కర్లేదు కియా సోనెట్‌ కోసం నెలకు రూ.21,900, సెల్టోస్‌కు రూ.28,900, కారెన్స్‌కు రూ.28,800 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని