Ola Electric: ఓలా ఆఫర్‌.. ఈ స్కూటర్లపై ₹25 వేల వరకు తగ్గింపు

Ola Electric: విద్యుత్‌ స్కూటర్లపై ఓలా ఎలక్ట్రిక్‌ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Published : 16 Feb 2024 17:20 IST

Ola Electric | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తమ విద్యుత్‌ స్కూటర్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫిబ్రవరి నెలకు గానూ ఎంపిక చేసిన స్కూటర్లపై రూ.25వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. ఎస్‌1 ప్రో, ఎస్‌ ఎయిర్‌, ఎస్‌1 ఎక్స్‌+ మోడళ్లకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఎస్‌1 ప్రో మోడల్‌ ధర రూ.1,47,499 కాగా.. రూ.1.29 లక్షలకు విక్రయించనున్నట్లు భవీశ్‌ పేర్కొన్నారు. ఎస్‌1 ఎయిర్‌ మోడల్‌ ధర రూ.1.19 లక్షలు కాగా.. రూ.1.04 లక్షలకు; ఎస్‌1 ఎక్స్‌+ మోడల్‌ ధర రూ.1.09 లక్షలు కాగా.. రూ.25 వేలు తగ్గించి రూ.84,999కే విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.  సవరించిన ధరలు ఫిబ్రవరి 16 నుంచే అందుబాటులోకి వస్తాయని భవీశ్‌ తెలిపారు.

పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత!

ఓలా ఆఫర్లు ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. జనవరిలోనూ కొన్ని మోడళ్లపై రూ.20వేలకు తగ్గింపు ప్రకటించింది. మరోవైపు ఓలా సంస్థ ఇటీవల ఎస్‌1 ఎక్స్‌ (S1X) శ్రేణిలో 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 190 కిలోమీటర్లు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే, బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని