Ola Electric sales: ఓలా ఎలక్ట్రిక్‌కు పండుగ బూస్ట్‌.. అక్టోబరులో 20,000 విక్రయాలు

పండుగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబర్‌ నెలలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆ నెలలో మొత్తం 20 వేల యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

Published : 01 Nov 2022 18:38 IST

దిల్లీ: ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ అక్టోబరు నెలలో 20 వేల యూనిట్లను విక్రయించింది. పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు భారీగా నమోదయ్యాయని తెలిపింది. నవరాత్రి సమయంలో రోజువారీ విక్రయాల్లో సాధారణ రోజుల కంటే నాలుగింతల వృద్ధి నమోదైనట్లు తెలిపింది.  విజయదశమి రోజైతే పదింతల అధిక అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. ఎస్‌1 ప్రో, ఎస్‌1 పేరిట ఈ కంపెనీ విద్యుత్తు స్కూటర్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఉన్న ఓలా తయారీ కేంద్రం ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో సగటున రోజుకు 1000 స్కూటర్లను తయారు చేస్తున్నారు. గత ఏడాది జులైలో రూ.499తో ఓలా ఎలక్ట్రిక్‌ బుకింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత అదే ఏడాది అక్టోబరులో వినియోగదారులకు స్కూటర్లను అందజేస్తామని తెలిపినప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఆ గడువు డిసెంబరు మూడో వారం వరకు పొడిగించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని