Ola Electric: ₹84,999కే ఓలా స్కూటర్.. ఇకపై మరిన్ని ఆప్షన్స్!
Ola Electric scooters: ఓలా విద్యుత్ స్కూటర్లు ఇకపై మరిన్ని ఆప్షన్లలో లభించనున్నాయి. మొత్తంగా 6 రకాల స్కూటర్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన విద్యుత్ స్కూటర్ల శ్రేణిలో మార్పులు చేసింది. ఎస్1 (Ola S1) స్కూటర్ల శ్రేణిలో కొత్తగా 2kWh బ్యాటరీ ఆప్షన్‌తో స్కూటర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లకు అదనంగా ఎస్1 ఎయిర్‌లో (Ola S1 Air) మూడు వేరియంట్లు, ఎస్1లో (Ola S1) ఒక వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ఎస్1, ఎస్1 ప్రో (Ola S1 pro)తో కలిపితే మొత్తం ఆరు స్కూటర్లు అందుబాటులో ఉండనున్నాయి. 2kWh బ్యాటరీ కలిగిన ఎస్1 ఎయిర్ ధరను రూ.84,999గా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించగా.. అదే బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎస్1 స్కూటర్ ధరను రూ.99,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
ఎస్1 స్కూటర్ విషయానికొస్తే.. కొత్తగా 2kWh బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఓలా ఎస్1 సింగిల్ ఛార్జ్‌తో 91 కిలోమీటర్లు (IDC) దూరం ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఇప్పటికే ఉన్న 3kWh బ్యాటరీ కలిగిన ఎస్1 స్కూటర్‌తో సింగిల్ ఛార్జ్‌తో 141 కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీని టాప్‌స్పీడ్ 95Kmph.
ఇక ఎస్1 ఎయిర్ విషయానికొస్తే.. కొత్తగా మొత్తం మూడు బ్యాటరీ ఆప్షన్స్‌తో ఈ స్కూటర్ లభిస్తుంది. 2kWh వేరియంట్‌తో 85 కిలోమీటర్లు, 3kWh వేరియంట్‌తో 125 కిలోమీటర్లు, 4kWh వేరియంట్‌తో 165 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ మూడు స్కూటర్లలో టాప్‌స్పీడ్ 85 కిలోమీటర్లుగా పేర్కొంది. గతంలో ఎవరైతే 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎస్1 ఎయిర్‌ను బుక్ చేశారో వారు ఆటోమేటిక్‌గా 3kWh బ్యాటరీకి అప్‌గ్రేడ్ అవుతారని కంపెనీ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 185 కిలోమీటర్ల రేంజ్, గంటకు 116 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వాహన శ్రేణిని సవరించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తెలిపారు. రోజకు 20-30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారి కోసం కొత్తగా 2kWh బ్యాటరీ ఆప్షన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. అన్ని ఎస్1 ఎయిర్ వేరియంట్ల బుకింగ్ నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేరియంట్లను మార్చడం వల్ల డెలివరీలు మూడు నెలల ఆలస్యం కానున్నాయని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)