PM Kisan: ‘పీఎం కిసాన్‌’పై మోదీ సంతకం.. పేమెంట్‌ స్టేటస్‌ ఇలా తెలుసుకోండి..

PM Kisan: పీం- కిసాన్‌ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Published : 11 Jun 2024 17:04 IST

PM Kisan | దిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ.. పీఎం కిసాన్‌ (PM Kisan) నిధుల విడుదల పైనే తొలి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పీఎం కిసాన్‌ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

పెట్టుబడి సాయం కింద మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా కేంద్రం ఈ పథకం కింద రూ.6 వేలు అందిస్తోంది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేసింది. 17వ విడతగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి మొత్తాలు త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు తెలుసుకోవచ్చు.

పేమెంట్‌ స్టేటస్ ఇలా..

పీఎం కిసాన్‌ (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి.. అందులో బెనిఫిషియరీ స్టేటస్‌ పేజీపై క్లిక్‌ చేయాలి. ప్రత్యేకంగా ఓపెన్‌ అయ్యే పేజీలో ఆధార్‌ లేదా అకౌంట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. గెట్‌ డేటా బటన్‌పై క్లిక్‌ చేయగానే పేమెంట్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. కాబట్టి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే అదే వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ బటన్‌ను క్లిక్‌ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సిఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని