EPFO: ఆధార్‌ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్‌ అవసరం లేదు: ఈపీఎఫ్‌వో

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గం సుగమమైంది.

Updated : 11 Jun 2024 10:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గం సుగమమైంది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించినవారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఆధార్‌ కేవైసీ పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్‌ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్‌ దరఖాస్తులో నోట్‌ ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా ఉద్యోగులు క్లెయిమ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని