PAN Aadhaar Link: ఆధార్‌తో పాన్‌ జత చేసుకున్నారా?

మీ ఆధార్, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది.

Updated : 31 May 2024 04:10 IST

నేటి వరకే అవకాశం

లేకపోతే టీడీఎస్‌ రెట్టింపు

మీ ఆధార్, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. గడువు లోపు జత చేయకపోతే, తర్వాత అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను బయోమెట్రిక్‌ ఆధార్‌తో అనుసంధానించాలి. లేకపోతే 2024 మార్చి 31 వరకూ నిర్వహించిన లావాదేవీలపై మూలం వద్ద పన్ను కోత రెట్టింపు అవుతుంది. మే 31 నాటికి ఈ రెండింటినీ జత చేసిన వారికి అధిక మొత్తంలో టీడీఎస్‌ విధించబోమని గత నెలలో ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. బ్యాంకులు, ఫారెక్స్‌ డీలర్లు, సబ్‌   రిజిస్ట్రార్ల్లు, ఎన్‌బీఎఫ్‌సీ, పోస్ట్‌ ఆఫీసు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌ ట్రస్టీలు, షేర్లపై డివిడెండ్‌ చెల్లించిన సంస్థలు మే 31 నాటికి ఎస్‌ఎఫ్‌టీ (స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ స్పెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌)ని సమర్పించాలని సూచించింది. లేకపోతే రోజుకు రూ.1,000 చొప్పున అపరాధ రుసుము విధించనున్నట్లు పేర్కొంది.

తెలుసుకోవడం ఎలా?

ఆధార్‌తో పాన్‌ అనుసంధానం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేసి, వివరాలు నమోదు చేయడం ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుంది. అనుసంధానమైతే లింక్‌ అయినట్లు సందేశం వస్తుంది. లేకపోతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. 

  • రుసుము చెల్లించిన తర్వాత 4-5 రోజుల తర్వాతే ఆధార్‌-పాన్‌ను అనుసంధానం చేసుకునేందుకు వీలవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు