Vehicle Sales: జనవరిలో రికార్డు స్థాయి గరిష్ఠానికి ప్రయాణికుల వాహన విక్రయాలు

Vehicle Sales: 2023 జనవరిలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడు కాగా.. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి.

Published : 13 Feb 2024 17:16 IST

Vehicle Sales | దిల్లీ: ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు జనవరిలో రికార్డు గరిష్ఠానికి చేరినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. ఎస్‌యూవీలకు భారీ గిరాకీ నమోదైనట్లు పేర్కొంది. క్రితం ఏడాది తొలి నెలలో 3,47,086 యూనిట్ల పీవీలు అమ్ముడయ్యాయి. ఈసారి అవి 13 శాతం పెరిగి 3,93,250కి చేరాయి. కొత్త మోడళ్ల ప్రవేశం, వివిధ రకాల పథకాలు, పెళ్లిళ్ల సీజన్ కలిసొచ్చినట్లు వివరించింది. విక్రయాలు భారీగా నమోదైనా, కార్ల కోసం ఇంకా 50-55 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఫాడా తెలిపింది.

జనవరిలో ద్విచక్ర వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం పెరిగి 14,58,849 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 89,208 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 37 శాతం పుంజుకొని 97,675కు, ట్రాక్టర్ల అమ్మకాలు 21 శాతం ఎగబాకి 88,671 యూనిట్లకు చేరాయి. మొత్తంగా గత నెలలో వాహన రిటైల్‌ విక్రయాలు 21,27,653 యూనిట్లుగా నమోదయ్యాయి. 2023 జనవరిలో అమ్ముడైన 18,49,691 యూనిట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది.

కేటగిరీల వారీగా వాహన విక్రయాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని