Stock Market: స్వల్ప లాభాల్లో మార్కెట్‌ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

Published : 17 Jul 2023 09:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం తొలి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, కంపెనీల త్రైమాసిక ఫలితాల విడుదల వంటి అంశాలతో మదుపరులు అప్రమత్తంగా ఉన్నారు. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 19 పాయింట్లు లాభంతో 19,584 వద్ద, సెన్సెక్స్‌ 19 పాయింట్ల లాభంతో 66,080 వద్ద ట్రేడవుతున్నాయి. ఏజీఐ గ్రీన్‌పాక్‌, జస్ట్‌డయల్‌, సుబెక్స్‌ లిమిటెడ్‌, ఐయాన్‌ ఎక్స్‌ఛేంజి షేర్లు లాభాల్లో ఉండగా.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌ఐఎస్‌ లిమిటెడ్‌, ఈకేఐ ఎనర్జీ సర్వీస్‌, చెన్నై పెట్రో, ఏంజెల్‌ వన్‌ షేర్ల విలువ కుంగింది. నేడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా ఎలిక్సిస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, క్రిసిల్‌, ఎల్‌టీ మైండ్‌ట్రీ వంటి కంపెనీలు ఫలితాలను వెల్లడించనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడి 82.145 వద్ద ట్రేడవుతోంది.

శ్రుకవారం రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం.. నేడు ఆసియాలోని ప్రధాన సూచీలపై ప్రభావం చూపింది. ప్రధాన ఆసియా మార్కెట్లు మొత్తం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 0.09శాతం, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ 1.17, జపాన్‌కు చెందిన నిక్కీ 0.09శాతం నష్టాల్లో ఉండగా.. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ 50 సూచీ మాత్రం 0.51శాతం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని