Tata Motors price Hike: టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాలూ మరింత ప్రియం

Tata Motors price Hike: ఇప్పటికే ప్రయాణికుల వాహనాల ధరల్ని పెంచుతామని ప్రకటించిన టాటా మోటార్స్‌.. కమర్షియల్‌ వెహికల్స్‌ ధరలనూ పెంచనున్నట్లు తెలిపింది.

Updated : 10 Dec 2023 15:26 IST

Tata Motors price Hike | దిల్లీ: కొత్త సంవత్సరం నుంచి ధరల్ని పెంచనున్నట్లు పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. టాటా మోటార్స్‌ (Tata Motors) సైతం తమ కార్ల ధరలను పెంచుతామని తెలిపింది. తాజాగా ఈ కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి వస్తోన్న వాణిజ్య వాహనాల ధరలను (Commercial Vehicle Prices) సైతం పెంచుతామని వెల్లడించింది. పెరిగిన ధరలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. మోడల్‌ను బట్టి పెంపు మూడు శాతం వరకు ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హోండా, ఆడి కంపెనీలు తమ ప్రయాణికుల వాహనాల ధరలను జనవరి నుంచి పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని