Tata Motors: ఫిబ్రవరి నుంచి టాటా వాహన ధరలు పెంపు

Tata Motors: ఫిబ్రవరి 1 నుంచి వాహన ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ఆదివారం ప్రకటించింది.

Published : 21 Jan 2024 14:06 IST

Tata Motors | దిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) వాహన ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 

నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్‌ ఆ ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం పంచ్‌ (Punch), నెక్సాన్‌ (Nexon), హారియర్‌ (Harrier) సహా పలు రకాల కార్లను విక్రయిస్తోంది. నూతన సంవత్సరంలో వాహన ధరల్ని పెంచనున్నట్లు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని