Tata Motors: మే 1 నుంచి టాటా మోటార్స్‌ కార్ల ధరల పెంపు

Tata Motors: ఫిబ్రవరిలోనే కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్‌ తాజాగా మరోసారి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పెంపు 0.6 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

Published : 14 Apr 2023 18:01 IST

దిల్లీ: తమ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ (Tata Motors) శుక్రవారం ప్రకటించింది. 2023 మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరలు 0.6 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. టాటా మోటార్స్‌ ఫిబ్రవరిలోనూ ధరల్ని పెంచిన విషయం తెలిసిందే.

కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ చేపట్టడంతో ఖర్చులు పెరిగాయని టాటా మోటార్స్‌ (Tata Motors) ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ముడి సరకుల ధరలు సైతం ఎగబాకినట్లు పేర్కొంది. ఇలా పెరిగిన భారాన్ని ఇప్పటి వరకు కంపెనీయే భరిస్తూ వచ్చిందని తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయాల్సి వస్తోందని చెప్పింది.

టాటా మోటార్స్‌ (Tata Motors) ప్రయాణికుల వాహన విభాగంలో టియాగో, టిగోర్‌, ఆల్ట్రోజ్‌, పంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ వంటి మోడల్‌ కార్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. వీటి ధరల శ్రేణి రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంది. ఫిబ్రవరిలో వీటి ధరలను 1.2 శాతం వరకు పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని