Tata price hike: మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు

Tata price hike from Jul 17th: టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. జులై 17 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.

Published : 03 Jul 2023 13:35 IST

దిల్లీ: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) తన పాసింజర్‌ వాహన ధరలను మరోసారి పెంచింది. జులై 17 నుంచి ఈ పెంపు ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యుత్‌ వాహనాలు సహా అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరగడమే ధరల పెంపునకు కారణమని టాటా మోటార్స్‌ తెలిపింది. 

హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్స్‌, ఎస్‌యూవీలు, ఈవీలన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. టియాగో, టిగోర్‌, ఆల్ట్రోజ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌ పేరిట వివిధ మోడళ్లను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది. నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ పేరిట విద్యుత్‌ కార్లను అమ్ముతోంది. అయితే, జులై 16 వరకు చేసే బుకింగ్‌లకు, జులై 31లోపు జరిగే డెలివరీలకు ధరల పెంపు వర్తించదని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి, మే నెలలోనూ టాటా తన కార్ల ధరలను పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని