Tata Tiago: టాటా టియాగో @ 5 లక్షలు

Tata Tiago: టాటా మోటార్స్‌ తీసుకొచ్చిన ఎంట్రీ లెవల్‌ కారు టియాగో సరికొత్త మైలురాయి అందుకుంది. 5 లక్షల విక్రయాల మార్కును చేరుకుంది.

Published : 06 Jul 2023 18:10 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ (Tata Motors) ఎంట్రీ లెవల్‌ కారు టియాగో (Tiago) వాహన అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలపింది. గడిచిన 15 నెలల్లోనే లక్ష కార్లను విక్రయించినట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్‌ కార్లకు ఆదరణ తగ్గుతున్న వేళ టియాగో కార్ల విక్రయాలు పెరగడం విశేషం.

మల్టిపుల్‌ పవర్‌ట్రైన్‌ ఆప్షన్‌తో కస్టమర్ల ముందుకు టాటా మోటార్స్‌ టియాగో వాహనాన్ని తీసుకువచ్చింది. పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌.. ఇలా మూడు రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా వివిధ ఆప్షన్లలో లభించడమూ సేల్స్‌ పెరగడానికి కారణమని కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విక్రయించిన వాటిలో 45 శాతం పెట్రోల్‌తో నడిచే టియాగో వాహనాలు అమ్ముడవ్వగా.. 42 శాతం విద్యుత్‌ వాహనాలు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 13 శాతం విక్రయాలు సీఎన్‌జీ వేరియంట్లో జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. విక్రయాల్లో 60 శాతం పట్టణ మార్కెట్ కాగా.. 40 శాతం విక్రయాలు రూరల్‌ మార్కెట్‌లో జరిగినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 71 శాతం మంది మొదటిసారి కారు కొన్నవారే ఉన్నారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని