Triumph: ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400ఎక్స్‌ వచ్చేసింది.. ధర, విశేషాలివీ!

Triumph Scrambler 400X: బజాజ్ ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో స్క్రాంబ్లర్‌ 400ఎక్స్‌ బైక్‌ను లాంచ్ చేశారు. దీని ధరను రూ.2.63 లక్షలుగా నిర్ణయించారు.

Updated : 10 Oct 2023 20:25 IST

Triumph Scrambler 400X | ఇంటర్నెట్ డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj auto),  బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ (Triumph) కలిసి గత నెలలో స్పీడ్‌ 400 పేరిట ఓ బైక్‌ను లాంచ్‌ చేశాయి. అప్పట్లో స్క్రాంబ్లర్‌ 400X (Scrambler 400X) పేరిట మరో బైక్‌ను కూడా లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ బైక్‌ను లాంచ్‌ చేశాయి. దీని ధరను రూ.2.63 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించారు. రూ.10వేలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయంఫ్‌ డీలర్‌షిప్‌ కేంద్రాల్లో విక్రయించనున్నారు. ఈ బైక్‌ను బజాజ్‌ చకన్‌ ప్లాంట్‌-2లో తయారుచేయనున్నారు.

నంబర్లేవీ లేకుండానే క్రెడిట్‌ కార్డు.. ఈ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌!

ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400X బైక్‌ 398 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 8000 ఆర్‌పీఎం వద్ద 40 హెచ్‌పీ పవర్‌ను, 6500 ఆర్‌పీఎం వద్ద 37.5ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. ఇందులో హెడ్‌లైట్స్‌, ఇండికేటర్లు, టెయిల్‌ లైట్స్‌ అన్నీ ఎల్‌ఈడీతో వస్తున్నాయి. సెమీ డిజిటల్‌ ఇన్సుస్ట్రుమెంటల్‌ క్లస్టర్‌ ఇచ్చారు. ట్రాక్షన్‌ కంట్రోల్‌, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, టార్క్‌ అసిస్ట్‌ క్లచ్‌, యూఎస్‌బీ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందువైపు 19 అంగుళాల అల్లాయ్‌ వీల్‌, వెనుక వైపు 17 అంగుళాల అల్లాయ్‌ వీల్ అమర్చారు. ఈ బైక్‌ బరువు 179 కిలోలు. గ్రీన్‌/వైట్‌, రెడ్‌/బ్లాక్‌, బ్లాక్‌/ సిల్వర్‌ కలర్‌ ఆప్షన్లతో లభిస్తోంది. స్పీడ్‌ 400తో పోలిస్తే స్క్రాంబ్లర్‌ కాస్త రగ్గ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు