Fibe- Axis Bank: నంబర్లేవీ లేకుండానే క్రెడిట్‌ కార్డు.. ఈ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌!

Fibe- Axis Bank co-branded credit card details: తొలి నంబర్‌లెస్‌ క్రెడిట్‌ కార్డును ఫైబ్‌ సంస్థ లాంచ్‌ చేసింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి దీన్ని తీసుకొచ్చింది. రూపే నెట్‌వర్క్‌పై ఇది పనిచేస్తుంది.

Published : 10 Oct 2023 18:58 IST

Fibe- Axis Bank credit card| ఇంటర్నెట్‌ డెస్క్‌: పుణెకు చెందిన ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ఫైబ్‌ (Fibe) యాక్సిస్‌ బ్యాంక్‌తో (Axis bank) కలిసి కొత్త క్రెడిట్‌ కార్డు లాంచ్‌ చేసింది. ఇదో నంబర్‌ లెస్‌ కార్డు. కార్డు మీద క్రెడిట్ కార్డు నంబర్‌ గానీ, సీవీవీ, ఎక్స్‌పైయరీ డేట్‌ గానీ ఉండవు. ఇదే ఈ కార్డు ప్రత్యేకత. ఆయా వివరాలు ఫైబ్‌ యాప్‌లో కనిపిస్తాయి. ఫైబ్‌-యాక్సిస్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంలో తీసుకొచ్చిన ఈ కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డు రూపే (Rupay) నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. దీంతో ఈ కార్డును యూపీఐకు అనుసంధానం చేసుకోవచ్చు. కార్డుపై వివరాలు లేకపోవడం వల్ల చోరీ అయిన సందర్భంలో అనధికారికంగా ఎవరూ ఈ కార్డును వినియోగించలేరని ఫైబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

భారత్‌లో అంబానీయే అత్యంత ధనవంతుడు

ఈ క్రెడిట్ కార్డు (Fibe- Axis Bank credit card) ఫీచర్ల విషయానికొస్తే.. అన్ని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, క్యాబ్‌ సర్వీసులు, టికెట్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లావాదేవీలపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఆవాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ట్యాప్‌ అండ్‌ పే ఆప్షన్‌ కూడా ఉంది. జాయినింగ్‌ ఫీజు లేదు. ఇది పూర్తిగా లైఫ్‌టైమ్‌ ఫ్రీ కార్డు. ఇందుకోసం ఎలాంటి మైల్‌స్టోన్స్‌ కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. దేశీయ విమానాశ్రయాల్లో నాలుగుసార్లు లాంజ్‌ సేవలను ఉచితంగా పొందొచ్చు. ఫ్యూయల్‌ సర్‌ఛార్జిపై రాయితీ వర్తిస్తుంది. అన్ని డిజిటల్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ కార్డును వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం 21 లక్షల మంది ఫైబ్‌ కస్టమర్లకు ఈ కార్డు జారీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని