TVS apache: రెండు రంగుల్లో టీవీఎస్‌ అపాచీ స్పెషల్‌ ఎడిషన్‌

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ అపాచీ 160 4V 2023 స్పెషల్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది.

Published : 29 Nov 2022 23:52 IST

చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ (TVS) అపాచీ 160 4V 2023 స్పెషల్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.30 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌, దిల్లీ)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్స్‌ వద్దా ఈ బైక్‌ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

సాధారణ అపాచీ 160 4Vతో పోలిస్తే ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో కొన్ని మార్పులు చేశారు. మ్యాటీ బ్లాక్‌, పెరల్‌ వైట్‌ రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుంది. డ్యూయల్‌ టోన్‌ సీట్‌; ఎడ్జస్టబుల్‌ క్లచ్‌, బ్రేక్‌ లీవర్స్‌తో వస్తోంది. ఇందులో 159.7 సీసీ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 17.30 బీహెచ్‌పీ పవర్‌ని 14.73 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌గేర్‌ బాక్స్‌ అమర్చారు.

ఇందులో అర్బన్‌, స్పోర్ట్‌, రెయిన్‌ పేరిట మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. స్పోర్ట్‌ మోడ్‌లో గరిష్ఠంగా 114 కిలోమీటర్లు వెళుతుందని కంపెనీ తెలిపింది. బ్లూటూత్‌ కనెక్టివిటీ కోసం స్మార్ట్‌కనెక్ట్‌ సదుపాయం అందిస్తున్నారు. ఇన్సుస్ట్రుమెంట్‌ క్లస్టర్‌లో సాధారణ సమాచారంతో పాటు గేర్‌ షిఫ్ట్‌ ఇండికేటర్‌ను అందిస్తున్నారు. ముందూ వెనుక డిస్క్‌బ్రేక్‌ ఇస్తున్నారు. ముందువైపు టెలీస్కోపిక్‌, వెనుకవైపు మోనో సస్పెన్షన్‌ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని