నలుపు రంగులో అపాచీ ఆర్‌టీఆర్‌ 160

టీవీఎస్‌ మోటార్‌ తన ‘అపాచీ 160 ఆర్‌టీఆర్‌’ బైక్‌లో బ్లాక్‌ డార్క్‌ ఎడిషన్‌ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది.

Updated : 18 May 2024 01:41 IST

ధర రూ.1.09 లక్షల నుంచి

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ తన ‘అపాచీ 160 ఆర్‌టీఆర్‌’ బైక్‌లో బ్లాక్‌ డార్క్‌ ఎడిషన్‌ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 కొత్త శ్రేణి మోటర్‌సైకిళ్లు రూ.1,09,990, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4 వాల్వ్‌ రూ.1,19,990 (ఎక్స్‌షోరూం, చెన్నై) ధరల్లో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. ‘తాజాగా తీసుకొచ్చిన బ్లాక్‌ ఎడిషన్‌.. స్పోర్టియర్, బోల్డర్‌ రూపుతో వినియోగదార్లను మరింతగా ఆకర్షిస్తుంది. పరిమిత గ్రాఫిక్స్‌ డిజైన్, ట్యాంకు మీద నలుపు రంగు టీవీఎస్‌ లోగో, నలుపు రంగు ఎగ్జాస్ట్‌ పైప్, నలుపు రంగు ఫినిషింగ్‌తో ఇది లభ్యమవుతుంద’ని టీవీఎస్‌ మోటార్‌ హెడ్‌ (బిజినెస్‌- ప్రీమియం) విమల్‌ సంబ్లీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు