Vehicle Retail Sales: వాహన రిటైల్ విక్రయాల్లో 14% వృద్ధి
Vehicle Retail Sales: జవనరి నెలలో అన్ని విభాగాల్లో వాహన రిటైల్ విక్రయాలు పుంజుకున్నాయి. ద్విచక్ర విభాగంలో మాత్రం వృద్ధి నెమ్మదిగా ఉందని ఫాడా గణాంకాలు తెలిపాయి.
దిల్లీ: జనవరిలో దేశీయంగా వాహనాల రిటైల్ విక్రయాలు (Vehicle Retail Sales) 14 శాతం వృద్ధి చెందాయి. ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు సహా అన్ని ప్రధాన విభాగాల్లో రిజిస్ట్రేషన్‌లు భారీగా పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఫాడా గణాంకాల ప్రకారం.. మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు (Vehicle Retail Sales) 2022 జనవరిలో 16,08,505 కాగా, గత నెలలో 18,26,669కు చేరాయి. ప్రయాణికుల వాహన విక్రయాలు 2,79,050 నుంచి 10 శాతం పెరిగి 3,40,220గా నమోదయ్యాయి.
మొత్తం వాహన విక్రయాలు (Vehicle Retail Sales) జనవరిలో గణనీయంగా పెరిగాయని మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. కానీ, కొవిడ్ మునుపటి జనవరి 2020తో పోలిస్తే మాత్రం విక్రయాలు ఇంకా 8 శాతం తక్కువగానే ఉన్నాయన్నారు. ఎంట్రీ-లెవెల్ విభాగంలో ఇప్పటికీ గిరాకీ తక్కువగానే ఉందన్నారు. బుకింగ్‌లు, సరఫరా పెరగడం, ఎంక్వైరీలు పుంజుకోవడం వంటి పరిణామాలు విక్రయాలకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ద్విచక్రవాహన అమ్మకాల్లో వృద్ధి నత్తనడకన సాగుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా గిరాకీ పుంజుకోవాల్సి ఉందన్నారు. ధరలు పెరగడం అక్కడ కొంత అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!