Tamilnadu: ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం.. 11మంది మృతి!

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై కొండపై ఉన్న ఆలయానికి వెళ్తున్న భక్తుల వాహనం లోయలోకి.....

Updated : 02 Apr 2022 22:07 IST

చెన్నై: తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై కొండపై ఉన్న ఆలయానికి వెళ్తున్న భక్తుల వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. 19మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. రహదారిపై మలుపు వద్ద వ్యాన్‌ని డ్రైవర్‌ అదుపు చేయలేకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. ప్రమాదం సమయంలో వాహనంలో మొత్తం 30 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. మృతులంతా పులియూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలికలే ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపిన పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

 ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్య శాఖ అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదంలో మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులైన వారి కుటుంబాలకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని