Crime News: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులమంటూ దోపిడీలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులమని చెప్పుకొంటూ దారి దోపిడీలకు పాల్పడిన ముగ్గురు దుండగులను బెంగళూరు విల్సన్‌ గార్డెన్‌ ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Updated : 29 Jan 2023 06:51 IST

నిందితులను అరెస్టుచేసిన బెంగళూరు పోలీసులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులమని చెప్పుకొంటూ దారి దోపిడీలకు పాల్పడిన ముగ్గురు దుండగులను బెంగళూరు విల్సన్‌ గార్డెన్‌ ఠాణా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బత్తుల శివరామకృష్ణ యాదవ్‌ (19), షేక్‌ చెంపతి లాల్‌ బాషా, షేక్‌ చెంపతి జాకిర్‌(27)గా గుర్తించారు. నగరానికి చెందిన కుమారస్వామి, చందన్‌ అనే వ్యాపారులను బెదిరించి వీరు ఇటీవల రూ.80 లక్షలు దోచుకున్నారు. పోలీసులు ఆ నగదు జప్తు చేశారు. నిందితులు ఏపీ పోలీసుల తరహాలో దుస్తులు ధరించి నేరానికి పాల్పడ్డారని డీసీపీ శ్రీనివాస్‌ గౌడ తెలిపారు. వీరిపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కుపైగా కేసులు ఉన్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించారు. పేకాట వ్యసనంతో వీరు అప్పుల పాలయ్యారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మెజెస్టిక్‌ సమీపంలోని ఒక హోటల్‌లో మళ్లీ జూదం ఆడారు. రూ.కోటి గెల్చుకున్నా కొద్ది గంటల్లోనే ఆ నగదును ఓడిపోయారు. మిగిలిన నగదుతో బెంగళూరు నుంచి పరారయ్యారు. నిందితులను చిత్తూరు జిల్లాలో అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని