TSPSC: ఇద్దరు నిందితుల భార్యలూ పరీక్ష రాశారు.. ప్రశ్నపత్రాల కేసులో కొత్త కోణం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో అరెస్టయిన ఇద్దరు నిందితుల భార్యలు సైతం పరీక్ష రాసినట్లు తాజాగా సిట్‌ పోలీసులు నిర్ధారించారు.

Updated : 18 May 2023 09:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో అరెస్టయిన ఇద్దరు నిందితుల భార్యలు సైతం పరీక్ష రాసినట్లు తాజాగా సిట్‌ పోలీసులు నిర్ధారించారు. కమిషన్‌ నెట్‌వర్క్‌ విభాగ ఇన్‌ఛార్జిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్‌నాయక్‌ భార్య శాంతి డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాసినట్టు సిట్‌ దర్యాప్తులో గుర్తించారు.

మరోవైపు రేణుక రాథోడ్‌తో పాత పరిచయం ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాహుల్‌.. ఆమె వద్ద నుంచి అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాశాడు. నాగార్జునసాగర్‌కు చెందిన రమావత్‌ దత్తు.. రేణుక భర్త డాక్యానాయక్‌ నుంచి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. కాల్‌డేటా ఆధారంగా ఏఈ, డీఏవో పరీక్షలు రాసిన అభ్యర్థులతో నిందితుల పరిచయాలపై క్షుణ్నంగా పరిశీలించినప్పుడు ఈ నలుగురి పేర్లు వెలుగుచూశాయి. దీంతో రాహుల్‌, దత్తు, సుచరిత, శాంతిలను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిట్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని