మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు

మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది.

Updated : 30 Apr 2024 07:20 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: మార్కుల మాయాజాలంలో చిక్కిన ఓ కుటుంబం రక్తపు మడుగులో విలవిల్లాడింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక మాధ్యమిక విద్య (పీయూసీ- ఇంటర్మీడియట్‌ సమాన) పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. బెంగళూరులోని బనశంకరి పోలీసు ఠాణా పరిధిలో నివాసముండే పద్మజ (40) మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని సోమవారం తన కుమార్తె (17)ను ప్రశ్నించింది. ఆమె కోపంతో కత్తి తెచ్చి తల్లిని నాలుగు సార్లు పొడిచింది. తల్లి కూడా కత్తి అందుకుని కుమార్తెపై ఎదురుదాడి చేసింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన కుమార్తె అక్కడికక్కడే మరణించింది. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన పద్మజను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని