ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్సై హత్య

ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 06 May 2024 07:59 IST

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోయినందుకు మధ్యప్రదేశ్‌లో దారుణం

శహ్‌దోల్‌: ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు యత్నించిన ఏఎస్సైను ట్రాక్టరుతో తొక్కించి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శహ్‌దోల్‌ జిల్లా బ్యోహారీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై మహేంద్ర బాగ్రీ, మరో ఇద్దరు సిబ్బంది కలిసి ఓ కేసులో నిందితుణ్ని అరెస్టు చేయడానికి శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. బదోలీ అనే గ్రామానికి చేరుకునేసరికి.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టరు ఎదురుగా వచ్చింది. వాహనాన్ని ఆపాలని సంజ్ఞ చేసినప్పటికీ డ్రైవర్‌ ట్రాక్టరును వేగంగా వారి మీదకు పోనిచ్చాడు. ఈ క్రమంలో మహేంద్ర ఆ వాహనం కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఇది గమనించిన డ్రైవర్‌.. ట్రాక్టరు దిగి పారిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్‌, మరో వ్యక్తిని అరెస్టు చేశామని.. వాహన యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని