
Published : 06 Dec 2021 06:33 IST
విద్యుదాఘాతంతో రైతు మృతి
మునగపాక, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా మునగపాక మండలం మడకపాలెం గ్రామానికి చెందిన రైతు దవులూరి చిలుకునాయుడు (40) ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిలుకునాయుడు పొలంలోకి వెళ్తుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్తుతీగపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాద స్థలాన్ని ఆర్‌ఈసీఎస్ అధికారులు, పోలీసులు పరిశీలించారు. చిలుకునాయుడుకు ముగ్గురు పిల్లలు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
Tags :