Andhra News: 108 సిబ్బంది నిరాకరణ.. బైక్‌పైనే బాలుడి మృతదేహం తరలింపు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో బుధవారం శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు బాలలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు.

Updated : 05 May 2022 10:49 IST

సంగం, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో బుధవారం శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు బాలలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువవద్ద నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను నీటిలో నుంచి బయటకు తీయగానే స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 వాహన సిబ్బందిని కోరగా నిబంధనలు అంగీకరించవంటూ వారు నిరాకరించారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు. ఆటోలు, ఇతర వాహనాల వారిని బతిమాలినా ఎవరూ ముందుకు రాలేదు. గత్యంతరం లేక ద్విచక్ర వాహనంపైనే శ్రీరామ్‌ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని