వడోదర హైవేపై ఘోర ప్రమాదం

గుజరాత్‌లోని వడోదర నగర సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు.

Published : 05 Oct 2022 05:46 IST

ఆటోను ఢీకొన్న ట్రక్కు.. 10 మంది మృతి

వడోదర: గుజరాత్‌లోని వడోదర నగర సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఆటో డ్రైవరుతోపాటు ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఓ కారును ఢీకొన్న కంటైనరు ట్రక్కు డ్రైవరు అదుపు కోల్పోవడంతో డివైడరు దాటి రోడ్డుకు అటువైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో లాంటి త్రిచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జుగా మారిపోయింది. ఇందులో చిక్కుకొన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు అగ్నిమాపకశాఖ సిబ్బందిని రప్పించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని