‘నాన్నా.. ప్రాణం పోయినా తప్పు చేయను’

సమీప బంధువుతో దిగిన ఫొటోలను అతడి స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో అవమానం భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

Updated : 16 Nov 2022 09:24 IST

సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య

గద్వాల గ్రామీణం, న్యూస్‌టుడే: సమీప బంధువుతో దిగిన ఫొటోలను అతడి స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో అవమానం భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లక్ష్మన్న, నాగమ్మలతోపాటు ఎస్సై ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన మేఘలత(20) జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన శివకుమార్‌(24) ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 6న శివకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను అతని మిత్రులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘‘నాన్నా! నేను నీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టినవారిని వదలకు. అమ్మను, చెల్లిని, తమ్ముడిని బాగా చూసుకో’’ అంటూ తండ్రికి లేఖ రాసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని