Hyderabad: చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు!

సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నాడని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Updated : 30 Jul 2023 12:36 IST

హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

‘‘కిషన్‌సింగ్‌.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ టార్చర్‌ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను’’ అని మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్‌సింగ్‌ పరిచయమైనట్లు ఆ మహిళ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని